Take a fresh look at your lifestyle.

ఉగ్రవాదులను చంపినందుకు భారతీయుడుగా గర్విస్తున్నాను.

  • ఆపరేషన్ సింధుర్ విజయవంతం చేసిన భద్రత దళాలకు ఇవే మా వందనాలు.
  • ఆమాయక భారతదేశ పర్యాటక  పౌరులను చంపడం హేయమైన  చర్య.

ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క సైనికునికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన పత్రిక ముఖంగా మాట్లాడుతూ భారతీయుడుగా పుట్టినందుకు తాను గర్విస్తున్నాను అని అన్నాడు.పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గామ్‌లో మన అమాయక సోదరులను దారుణంగా  చంపినందుకు భారత్ ప్రతిస్పందనే ఆపరేషన్ సిందూర్ అని అన్నారు.పహల్గాం ఉగ్రదాడిపై సరైన ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మకం అని ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన సైనికులకు శుభాకాంక్షలు మరియు వందనాలు తెలిపారు.భారత్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించదు అని నిరూపించిన భారత ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలిపారు.భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా నేను గర్వపడుతున్నాను.ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా  ప్రపంచ మానవాళికి నష్టమే తప్ప లాభం చేకూర్చదని నా అభిప్రాయం.ఉగ్రవాదం, ఉన్మాదం, ఎప్పటికైనాఅంతం కావాల్సిందే అని అన్నారు.ఈ విషయంలో సముచితంగా, సమన్వయంతోగ ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి, సామరస్యాలు నెలకొంటాయన్నారు.భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.

Leave A Reply

Your email address will not be published.