Take a fresh look at your lifestyle.

చెక్కుతోపాటు తులం బంగారు ఇవ్వాలి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

 

ముద్ర,కుషాయిగూడ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సహాయము తో పాటు తులం బంగారు కూడా ఇవ్వాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు
మల్కాజిగిరి నియోజకవర్గంలో మంగళవారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నేరేడ్మెట్‌లోని జీకే సరస్వతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మార్వో సీతారాం మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, పరశురాం రెడ్డి, జీకే హనుమంతరావు, జేఏసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.