కోరుట్ల, ముద్ర విలేకరి: జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ శుక్రవారం రోజు కోరుట్ల మండలం లోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు, ఎరువుల అమ్మకాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లు, లైసెన్సులను పరిశీలించారు, డీలర్లు అందుబాటులో ఉన్న ఎరువులు, మందులు, అనుగుణంగా స్టాక్ బోర్డు రైతులకు కనబడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మండలం లో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు యునిక్ ఐడీ (ఫార్మర్ రిజిస్ట్రీ) నమోదు కార్యక్రమాన్ని సందర్శించారు, రైతులoదరూ కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ది కోసం వ్యవసాయ శాఖ వద్ద ఫార్మర్ రిజిస్ట్రర్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.