Take a fresh look at your lifestyle.

కనుల పండుగగా కనకదుర్గమ్మ జాతర

 

చిలుకూరు, ముద్ర:

చిలుకూరు మండలం బేతావోలు గ్రామంలో శుక్రవారం కనకదుర్గమ్మ జాతరను కనుల పండుగగా జరుపుకున్నారు. మూడు రోజులు పాటు సాగే ఈ పండుగ మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రభలు కట్టి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు సంస్కృతిక కార్యక్రమాలు ఎడ్ల పందాలు నిర్వహించారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని ఆయన మాట్లాడుతూ, ప్రశాంతమైన వాతావరణంలో జాతరను జరుపుకుంటున్న బేతావోలు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందంటూ తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తున్న కనకదుర్గమ్మ వారి జాతర శివరాత్రికి ముందు జరుపుకుంటారని, ఈ గ్రామ ప్రజలకు కనకదుర్గమ్మ వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని పాడిపంటల్లోనూ గ్రామం సుభిక్షంగా ఉండేలా ఆ అమ్మవారు అనుగ్రహం ఉండాలని, బేతావోలు అంటే కమ్యూనిస్టు పార్టీకి కంచు కోటాని తాళ్లూరి భద్రయ్య గారు చేసిన సేవలు మర్చిపోలేనివి అని, బేతావోలు దొరలకు వ్యతిరేకంగా పోరాడినది కమ్యూనిస్టు పార్టీ అని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేమిడాల రాజు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు,సిపిఐ పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిల్లుట్ల కనకయ్య, నంద్యాల రామ్ రెడ్డి, ఎస్కే సాయి బల్లి, కాంపాటి వెంకటయ్య, చిలువేరు ఆంజనేయులు, నారాయణపురం సర్పంచ్ మండవ జయమ్మ, జరిపోతుల గూడెం సర్పంచ్, గుగులోత్ లలిత, ఉప సర్పంచ్ ఉరదండు దుర్గ, గ్రామ శాఖ కార్యదర్శి తాళ్లూరి వెంకటయ్య, బెజవాడ వినోద్, కమిటీ నిర్వాహకులు రామారావు, పెద్ద మల్లయ్య, రాజేష్, మహమ్మద్, నాగేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.