Take a fresh look at your lifestyle.

వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగిన హస్తం హవా

మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగిన హస్తం హవా
నాలుగు మున్సిపాలిటీలు అస్తగతం
కారుకు ఎదురుగాలి
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కాను నాలుగు మున్సిపాలిటీల్లో పూర్తి మెజార్టీ సాధించి కాంగ్రెస్ పార్టీ అస్తగతం చేసుకుంది. ఈ నాలుగు మున్సిపాలిటీలో పూర్తి మెజారిటీ సాధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది. వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 స్థానాలకు గాను కాంగ్రెస్ కు 20, బిఆర్ఎస్ కు 8, బిజెపికి 2, సిపిఎం కు 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. కొత్తకోట మున్సిపాలిటీలో మొత్తం 15 కౌన్సిల్ స్థానాలకు కాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ మూడు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్లు ఒకరు విజయం సాధించి పూర్తి మెజారిటీ కాంగ్రెస్ కు కట్టబెట్టారు. పెబ్బేరు మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాలకు గాను, కాంగ్రెస్ 7, టిఆర్ఎస్ 5 స్థానాలు గెలుపొంది కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ అందించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం పది స్థానాలు ఉండగా కాంగ్రెస్కు ఆరు బీఆర్ఎస్ ఒకటి బిజెపి మూడు గెలుపొందాయి. ఈ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు గెలుపొంది పూర్తి మెజార్టీని సాధించింది. అమరచింత మున్సిపాలిటీలో మొత్తం పది స్థానాలు ఉండగా కాంగ్రెస్ కు మూడు, బీఆర్ఎస్ కు మూడు, బిజెపి మూడు, సిపిఎం ఒకటి సాధించి హంగుకు అవకాశం కల్పించాయి. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆవా కొనసాగినట్లు కనిపిస్తుంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గాను నాలుగు మున్సిపాలిటీలు సులభంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.