రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే సస్పెన్షన్ కాలానికి పూర్తి వేతనం చెల్లించాలని ఆదేశించిన ప్రభుత్వం తాజాగా మరో తీపికబురు చెప్పింది. ఏబీ వేంకటేశ్వరరావును ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు సీఎస్ కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఏ.బి వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లోపేర్కొంది. ఇకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ.బి వెంకటేశ్వరరావు రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఉదయం పోస్టింగ్ ఇవ్వడం ఆ సాయంత్రమే రిటైర్డ్ అవ్వడం గమనార్హం. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. సస్పెన్షన్ కాలానికి జీతం ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా ఏబీ వేంకటేశ్వరరావును ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.