ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు. అక్రమంగా అరెస్టు చేసిన బాల్క సుమన్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కొంతమంది పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా వ్యవహారిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతున్నారని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. పోలీసులు పారదర్శకంగా పనిచేయాలని సూచించారు.