Take a fresh look at your lifestyle.

రాష్ట్ర స్థాయిలో మెరిసిన దివ్యాంగ విద్యార్థులు..

 
రాష్ట్రస్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీల్లో యాదాద్రి జిల్లాకు 14 పతకాలు..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :


హైదరాబాద్ లోని రాష్ట్ర వ్యాయామ విద్య కళాశాలలో మంగళవారం నిర్వహించిన దివ్యాంగ చిన్నారుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు వివిధ కేటగిరీలలో బాలురు బాలికలు కలిపి (అండర్ 14, అండర్ 17 విభాగాల్లో)14 పతకాలు సాధించారు.
రాష్ట్ర స్థాయిలో దివ్యాంగ విద్యార్థులకు జరిగిన మొట్టమొదటి క్రీడా పోటీల ప్రారంభంలో జరిగిన మార్చ్ ఫాస్ట్ లో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు ప్రత్యేక ప్రతిభ చూపించి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా.నవీన్ నికోలస్ ద్వారా ద్వితీయ బహుమతి అందుకున్నారు.
హాజరైన 25మంది విద్యార్థుల్లో ప్రతీ ఒక్కరూ అద్వితీయమైన ప్రతిభ కనబరిచి 14 రాష్ట్రస్థాయి బహుమతులు సాధించారు. పథకాలు సాధించిన వారు విద్యా శాఖ సహాయ సంచాలకులు వెంకట నరసమ్మ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
బహుమతులు పొందిన దివ్యాంగ చిన్నారులు:
చెంచా గోళీ ఆటలో కె.చందు, ఐ.హాసిని, క్యారమ్ బోర్డు లో చందన మొదటి బహుమతులు అందుకున్నారు. 50 మీ.పరుగు పందెంలో పి.నరసింహ,


జి.మధుబాల ద్వితీయ బహుమతులు,
జిగ్జాగ్ వాకింగ్లో పి.మనోజ్ ద్వితీయ బహుమతి, కప్పగంతులలో అశ్విన్ తేజ ద్వితీయ బహుమతి, చెంచా గోళీ ఆటలో అరవింద్, శ్రీనాథ్, ద్వితీయ బహుమతులు, డిస్కస్ త్రోలో రోహిత్,
అనన్య, రేఖ ద్వితీయస్థానం, ఎస్.నేహా కుర్చీ ఆటలో తృతీయ స్థానం,
వి.అశ్విత క్యారమ్ బోర్డు లో తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ, జిల్లా సమగ్ర విద్య కోఆర్డినేటర్(కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి) పెసరు లింగారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.