Take a fresh look at your lifestyle.

పదవీ విరమణ పోలీస్ అధికారులకు సన్మానం

 

ముద్ర :మల్కాజిగిరి

మల్కాజ్‌గిరి సీపీ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కోసం నేరడ్మేట్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి సీపీ అవినాష్ మహంతి అధ్యక్షత వహించి, పదవీ విరమణ చేస్తున్న అధికారులను సన్మానించారు.
వారి సేవాకాలంలో చూపిన అంకితభావం, నిబద్ధతకు సీపీ కృతజ్ఞతలు తెలుపుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో వారి కీలక పాత్రను ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సమయం గడపాలని, అభిరుచులను కొనసాగిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన అధికారుల కుటుంబ సభ్యులు, సహచరులు పాల్గొని భావోద్వేగ వాతావరణాన్ని నెలకొల్పారు. డీసీపీ ఎస్‌బీ జి. నరసింహ రెడ్డి, ఏడీసీపీ అడ్మిన్ శివకుమార్, ఎస్ బీ ఎసిపి.రవీందర్ రెడ్డి,సీఏఓలు శ్రీనివాస్, పుష్పరాజ్, సీహెచ్ భద్రారెడ్డి, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.