ముద్ర మొయినాబాద్: నిరుద్యోగ యువతి, యువకుల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌండ్ల నిరంజన్ గౌడ్ నిరుద్యోగులకు సూచించారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని పేర్కోన్నారు.రాష్ట్రంలో నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యమన్నారు.ఈ పథకం ద్వాఆ నిరుద్యోగులకు రూ.4 లక్షల వరకు రుణాలను ప్రభుత్వం అందించనుందని పేర్కోన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ I కార్పొరేషన్ల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.అభ్యర్థులు ఏప్రిల్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.అర్హులైన అభ్యర్థులను దరఖాస్తును పరిశీలించి జూన్2వ తేదిన రుణాలు మంజూరు చేయనున్నట్లు నిరంజన్తోడ్ తెలిపారు. మూడు రకాలుగా కేటరీలుగా విభజించి సబ్సిడి ఇవ్వనున్నట్లు పేర్కోన్నారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.