Take a fresh look at your lifestyle.

మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖందించిన గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి : మహా న్యూస్ ఛానల్ సీయండీ వంశీని కలిసి యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రముఖ మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది హేయమైన చర్య అని, మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం అని చైర్మన్ గాంధీ అన్నారు. ఒక పిరికి పంద చర్య అని, సభ్య సమాజం తలదించుకునేల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు అని బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదన్నారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరని, మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.