Take a fresh look at your lifestyle.

ఆరోగ్యమే మహాభాగ్యం

  • జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

ముద్ర, జగిత్యాల టౌన్: ఆరోగ్యమే మహాభాగ్యం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ శ్రీ వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో సోమవారం పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం, వివేకానంద మినీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అద్యక్షులు నేరెళ్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తోడేటి లచ్చయ్య, సహాయ కార్యదర్శి మహేందర్ రావు, కోశాధికారి ఆనంతుల విటలయ్య, డైరెక్టర్లు తోగిటి శ్రీనివాస్, బుర్ర చంద్రశేఖర్, చికోటి శ్రీనివాస్, చోటపెల్లి నారాయణ, జోగ మల్లేశం, ముస్కె శ్రీనివాస్, ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.