ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణ లక్ష్యంగా ప్రారంభమైన అరైవ్ అలైవ్ కార్యక్రమం రెండో రోజు జిల్లావ్యాప్తంగా కొనసాగింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లేన్ డిసిప్లిన్ డ్రైవ్ డే నిర్వహించారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తప్పుడు ఓవర్‌టేకింగ్ చేస్తున్న వాహనదారులను గుర్తించి అవగాహన కల్పించారు. ఎడమ లేన్‌లోనే వాహనం నడపాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై వాహనదారులకు వివరించారు. రహదారి భద్రత అందరి బాధ్యత అనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు.