సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 23:
భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని National Centre for Disease Control ( ఎన్ సి డి సి ) మరియు United Nations Development Programme ( యు ఎన్ డి పి ) సంయుక్తంగా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసెస్మెంట్ లో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లాను సందర్శించాయి.

ఈసందర్భంగా ఉదయం NCDC బృందం,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. వసంత్ రావు, ఎపిడెమియాలజిస్ట్,యు ఎన్ డి పి ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ లక్ష్యాలు,అమలు విధానం, ఆయా శాఖల సమన్వయం పై చర్చించారు.తదనంతరం బృందం జిల్లా ప్రయోగశాల అయిన T-Hub ను సందర్శించి,ప్రస్తుత పరీక్షా సదుపాయాలు, డిజిటల్ రిపోర్టింగ్ వ్యవస్థలు,వ్యాధి నిర్ధారణ సామర్థ్యాన్ని పరిశీలించారు.సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్, ప్రొఫెసర్‌లతో సమావేశమై జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల నిర్ధారణ,నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు.అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వెటర్నరీ & పశుసంవర్ధక శాఖ,అటవీ/వన్యప్రాణి శాఖ,వ్యవసాయ, పంచాయతీ
రాజ్,మున్సిపల్ ,SERP, విపత్తు నిర్వహణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఆహార భద్రత తదితర శాఖల ప్రతినిధులు,ఇక్రిసాట్ (ICRISAT) ప్రతినిధులతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.పిమ్మట మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.
వివిధ శాఖలలో ప్రస్తుతం అమలులో ఉన్న డిజిటల్ వ్యవస్థలను అధ్యయనం చేయడం,ఆసుపత్రులు మరియు ప్రయోగశాలల సామర్థ్యాన్ని అంచనా వేయడం,వన్ హెల్త్ ప్రాజెక్ట్ సమర్థవంతమైన అమలుకు అవసరమైన మౌలికవసతులు, సదుపాయాలు,సమన్వయ వ్యవస్థలను పరిశీలించడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
జిల్లాలో వన్ హెల్త్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులను ముందస్తుగా గుర్తించి నియంత్రించడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో డా.ఎం. వసంతరావు (DM&HO), డా. అతుల్ ఆనంద్ (కన్సల్టెంట్, వన్ హెల్త్ – UNDP), డా. సంజీవ్ సైని (సర్వైలెన్స్ – NCDC), డా.వెట్రివేల్ (కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్), డా.సయన్ రాయ్,డా. కార్డిలియా (ఎపిడెమియాలజిస్ట్),ప్రోగ్రాం ఆఫీసర్లు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.