కోరుట్ల, ముద్ర: భారతీయ జనతా పార్టీ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పార్టీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంటరానితనం పై పోరాటం చేసిన ఉదాత్త చరితుడు సామాజిక అంతరాలను రూపుమాపేందుకు కృషిచేసిన సామాజిక తత్వవేత్త, స్త్రీ విద్యకై పాఠశాలలను స్థాపించిన మార్గదర్శి అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణం శాఖ అధ్యక్షులు బింగి వెంకటేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యవర్గం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.