Take a fresh look at your lifestyle.

ఘనంగా మహాత్మా జ్యోతిభాపూలే 198 జయంతి ఉత్సవాలు

కోరుట్ల, ముద్ర: మహాత్మా జ్యోతిభాపూలే 198 జయంతి ఉత్సవాలు శుక్రవారం రోజు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిభాపూలేకు ఘన నివాళి అర్పించారు. అనంతరం పులె గురించీ మాట్లాడుతూ గొప్ప సంఘ సoస్కర్త, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడనీ కొనియాడారు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడనీ అన్నారు. బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.