Take a fresh look at your lifestyle.

అంగన్ వాడిలో పోషణ పక్వాడ్ పై అవగాహన

గొల్లపల్లి, ముద్ర : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ అంగన్వాడి కేంద్రాలలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జానకి ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా చైల్డ్ వెల్ఫేర్ అధికారి రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.మహిళలు చిరుధాన్యాలు మొలకెత్తిన విత్తనాలు స్థానికంగా దొరికే ఆకుకూరలు కూరగాయల లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.తాజా కూరగాయలు పండ్లు ఆకుకూరలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు ప్రతినెల క్రమం తప్పకుండా బరువు,ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఐరన్ కాల్షియం మాత్రలు అవసరం మేరకు తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని సూపర్వైజర్ జానకి తెలిపారు.గర్భిణులకు శ్రీమంతాలు ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందాని వారు తెలిపారు.అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారి మాట్లాడుతు.బాల్య వివాహాల గురించి మాట్లాడుతూ.ఆడవారికి 18 సంవత్సరాలు మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని తల్లుల కు సూచించారు.అనాధ పిల్లల పోషణ గురించి అలాగే బాల కార్మికుల సంరక్షణ గురించి తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జానకి చైల్డ్ వెల్ఫేర్ అధికారి రవీందర్ పంచాయతీ కార్యదర్శి జీవన్ అంగన్వాడి టీచర్లు ఏం.స్వప్నఎం.తిరుమల ఆశాలు రాధా, లక్ష్మి, తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.