- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : గ్రీవెన్స్ డే బాధితుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను ఎస్పీ పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.బాధితుల ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.