కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,
ముద్ర, చిట్యాల :
కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యస్. వీరయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరిగిన ఎస్ ఎఫ్ ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షులు అరూరి ప్రణీత్, శ్రీ వాణిల కులాంతర వివాహానికి వారు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాంతర వివాహాలు సమాజంలో సామాజిక సమానత్వం ను పెంపోందిస్తాయని అన్నారు. ఆదర్శ వివాహంను అంగీకరించి పెండ్లికి ఒప్పుకున్న ఇరువురి కుటుంబాల తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, కెవిపియస్ రాష్ట్ర కార్యదర్శి టి స్కై లాబ్ బాబు, గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, బొజ్జ చిన్న వెంకులు, అవిశెట్టి శంకరయ్య, డివైయప్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, సిపిఎం మండల నాయకులు అరూరి శ్రీను, పంది నరేష్, నెలికంటి నర్సింహా వివిధ ప్రజా సంఘాల నాయకులు అంతటి స్వామి, దేశబోయిన నర్సింహా,అరూరి శంభయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, అరూరి నర్సింహా, ఆడపు రమేష్, బొడ్డుపల్లి శ్రీను, గోలి సాయి కిరణ్, విఘ్నేష్, వెంకటేష్ పాల్గొన్నారు.