Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ సమ్మెకు భారాస సంపూర్ణ మద్దతు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి 

 ముద్ర, వనపర్తి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై సమ్మేను జయప్రదం చేయాలని, సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని డిఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు వాకిటి శ్రీధర్ అన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 22 ఏప్రిల్ 2026 మొదటి డ్యూటి నుండి జరుగు సమ్మెను జయప్రదం చేసి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, 2025 వేతన సవరణ అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెల 400 కోట్లు ఆర్టీసికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి/బెడ్ విన్నర్ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలన్నారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఆర్టీసి ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలని /కండక్టర్ డైవర్లలపై KMPL, EPK వేధింపులు మానుకొవాలని. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసికి ఇవ్వాలni/ ఆర్టీసి స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదని అన్నారు. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లలను ఆర్టీసిలో విలీనం చేసుకోవాలని (గతంలో మాదిరిగా జాతీయం చేసుకోవాలని ) డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతగా బదిలి చేసే ఉత్తర్వులను రద్దు చేయాలని /2019సమ్మే కాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేయాలని. మహిళా కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని / అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలని. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించాలని /చెల్లించటంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.