ముద్ర, వనపర్తి:
ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో స్కాలర్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో బీ. మహాలక్ష్మి 993 మార్కులు, అలీషా సాజి 992, సుస్మిత 991, బాంధవి 999 మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఎంపీసీలో కే.నర్మద 992, కే. శిరీష 991, కే.లలిత 989 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీఈసీ లో టి. శ్రావణి 771 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో బైపిసి లో డి. పల్లవి 437, నిమ్రా అప్సిన్ 437, అక్షయలక్ష్మి 436, భవ్య శ్రీ 434, యామిని 434, సాత్విక 434, రాజేష్ 434, ఇందు 432, అఖిలాండేశ్వరి 432, గేయ శ్రీ 432, అఖిల 432 మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఎంపీసీలో బన్నీ 463 మార్కులు జి.హర్షిత 462, శ్రీ వర్షిని 462, దివ్యశ్రీ 460 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీఈసీ లో ముష్కన్ 46 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వీరిని ప్రోత్సహించిన అధ్యాపకులను, అధ్యాపకేతర బృందాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ , మధుసూదన్ గుప్తా, డైరెక్టర్లు జగదీశ్వర్, వరప్రసాదరావు, నాగేశ్వర్రెడ్డి సత్యనారాయణరెడ్డి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు.
