Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ రంగ సంస్థల మనగుడతోనే అభివృద్ధి -మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్

 

ముద్ర, కాప్రా

ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే
కార్మికుల మనుగడ సాగుతుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఈసీఐఎల్) అనురాగ్ కుమార్ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈసీఐఎల్ అభివృద్ధికి అనురాగ్ కుమార్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు, జాతీయ నాయకులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అనురాగ్ కుమార్ ను సత్కరించి ఈసీఐఎల్ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కొరకు చేసిన కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు
ఎం. లక్ష్మణ్ గౌడ్, చర్లపల్లి
నాదం, బాలకృష్ణ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, ఈసీఐఎల్ బిఎంఎస్ కార్మిక సంఘం నాయకులు శ్రీ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.