ముద్ర ,కాప్రా
నాయి బ్రాహ్మణ కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు .మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ నాయి బ్రాహ్మణ సంఘం 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గానికి ఆయన అభినందనలు తెలియజేసారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం సమాజంతో ముడి పడి ఉన్న గొప్ప సేవ అని అన్నారు. సంఘానికి సంబందించి ఎలాంటి అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారం చేస్తానని తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాసులు రెడ్డి, వంజరి ప్రవీణ్ కరిపే, గుమ్మడి జంపాల్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, హెచ్ బీ కాలనీ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ శేఖర్, కోశాధికారి దశరథ, తదితరులు పాల్గొన్నారు.