Take a fresh look at your lifestyle.

హెచ్ యు జె ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: సెక్యులరిజానికి స్ఫూర్తిగా, ముప్పై యేండ్లుగా,ప్రతి ఏటా రంజాన్ మాసంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందును ఇవ్వాళ బషీర్ బాగ్ లోని TUWJ కార్యాలయంలో ఘనంగా నిర్వహించింది. ఆయా ఉర్దూ పత్రికలు, ఉర్దూ ఛానెల్స్ లో పనిచేస్తున్న దాదాపు 140మంది జర్నలిస్టులు ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని HUJ ఆతిథ్యాన్ని స్వీకరించారు.తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఫుడ్స్ సంస్థ చైర్మన్ ఎం.ఏ.ఫహీం, సీనియర్ ఉర్దూ జర్నలిస్టు మరియు మాజీ ఎమ్మెల్సీ జాఫ్రీ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, మాజీద్,ఐజేయు కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.