Take a fresh look at your lifestyle.

భూభారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం -తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్:

భూభారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం కాబోతుందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. సర్వే జరుగుతున్న రైతు రామిరెడ్డి పొలాన్ని సందర్శించి రైతులతో బాటు సర్వేయర్లతో నేరుగా మాట్లాడి సర్వే జరుగుతున్న సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ధరణి స్థానంలో భూభారతి వ్యవస్థను తీసుకొచ్చామన్నారు.

గత ప్రభుత్వ పాలనలో పాలకుల నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ వ్యవస్థను సర్వ నాశనం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సమగ్రమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ధరణి స్థానంలో భూభారతి వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రైతులకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ఉద్దేశంతో అధికారులు నేరుగా గ్రామానికి వచ్చి సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. పట్టా సర్వే నంబర్ స్థానంలో భూదాన్ నెంబర్ ప్రవేశపెడుతుందని వివరించారు. సర్వేలో భాగంగా పట్టా భూమి, గ్రామకంఠం, భూధాన్, ప్రభుత్వ భూమి ఏది అనేది స్పష్టంగా వేరుచేసి గుర్తించడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా పారదర్శకమైన సుస్థిరమైన భూ రికార్డు వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరాం నాయక్, పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య, లొంక నర్సింలు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.