Take a fresh look at your lifestyle.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన బొక్క జైపాల్ రెడ్డి

 

ముద్ర, బీబీనగర్:

బీబీనగర్ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు అగ్రనేతలను కలుసుకున్నారు. తొలుత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభివాదం చేయడంతో పాటు ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బీబీనగర్ మండలంలో ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితులను ఆయనకు వివరించారు. అలాగే హైదరాబాద్ లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును, అలాగే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిశారు. ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు సమస్యలపై ప్రజా ఉద్యమాలకు ఏవిధంగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారో.. ఆయా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారన్నదానిపై కాసేపు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు,

Leave A Reply

Your email address will not be published.