Take a fresh look at your lifestyle.

ప్రజా ఫిర్యాదు లను సత్వరమే పరిష్కరించాలి

  • జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: ప్రజా ఫిర్యాదు లను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు.ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 119 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ భూ సమస్య లు, భూ సర్వే, పెన్షన్ లకు సంబందించి ఫిర్యాదు లు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర,డి ఆర్ డి ఓ శ్రీనివాస్,వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.