Take a fresh look at your lifestyle.

మేం ఎలా చేశాం.. వాళ్లు ఎలా చూశారు

  • తెలుగు పరిశ్రమ పెద్దలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్.
  • సీఎంను ఒక్కసారైనా కలిశారా అంటూ నిలదీత.
  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ వ్యాఖ్యలు వైరల్​.

ముద్ర, సినిమా ప్రతినిధి : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమంతం పెరిగిపోయింది.ప్రతి సినిమా కూడా కొన్ని కోట్లు కొల్లగొడుతుంది.అయితే గత ప్రభుత్వంలో తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి దీనంగా తయారయింది. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది.ఈ విషయంపై నాని, పవన్ కళ్యాణ్ వంటి నటులు మాట్లాడి టార్గెట్ గా మారారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

  • పవన్​ వార్నింగ్​.

తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.తమ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారా అని పవన్‌ ప్రశ్నించారు. సినీపెద్దలు, అగ్రనటులను గత ప్రభుత్వం ఎలా చూసిందో మర్చిపోయారా అని పవన్ గుర్తుచేశారు.గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని అన్నారు.ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవన్న పవన్ సినిమా సంఘాల ప్రతినిధులే రావాలన్నారు.తమ ప్రభుత్వం వ్యక్తులను కాదు సినీరంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు.దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్ అయినట్లు స్పష్టమవుతున్నది. ఆయన నటించిన హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన మండిపడ్డారు.పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంటే కనీసం కృతజ్ఞత చూపడం లేదంటూ ఫైరయ్యారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది.అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని పవన్ వెల్లడించారు.దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చి్స్తామని తెలిపారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తున్నామని, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదన్నారు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును  తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదని, కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదన్నారు.

  • వ్యాఖ్యలు వైరల్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.అయితే దీనిపై తెలుగు సినిమా పరిశ్రమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ తరుణంలో థియేటర్లు మూసి వేస్తారు అనే వార్తలుకు కూడా, దానిని వాయిదా వేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటనతో చెక్ పెట్టారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్.

Leave A Reply

Your email address will not be published.