- అబద్ధాల పునాదులపై నడుస్తోన్న బీఆర్ఎస్.
- సిస్టర్ స్ట్రోక్‍తో కేటీఆర్ చిన్న మెదడు చిదికిపోయింది.
- మంత్రి సీతక్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో : అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని తెలిపారు.కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌లో కలకలం సృష్టిస్తున్న కవిత లేఖ, కేటీఆర్ కామెంట్స్‌పై మంత్రి సీతక్క స్పందించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయిందంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో కేటీఆర్‌ను మించిన వారు లేరని, కేటీఆర్‌కు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలన్నారు.కవిత అన్న దెయ్యం కేటీఆరే కావొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు.ప్రధాని మోదీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు.రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని తెలిపారు.యుద్ధంలో ట్రంప్ నీతిని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు.అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారన్నారు.రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.కేటీఆర్‌కు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా అని నిలదీశారు.గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడిదో సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.