Take a fresh look at your lifestyle.

రాత్రి 11లోపు దుకాణాలు మూసివేయాలి డీఎస్పీ ప్రసన్న కుమార్

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు.
ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.