ముద్ర, గద్వాల:
ఈనెల 23వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని గత సోమవారం అధికారులకు జనాభా గణన శిక్షణ కార్యక్రమాలు ఉన్నందున తాత్కాలికంగా రద్దు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమాన్ని తిరిగి సోమవారం 23వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యల పట్ల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఇదేవిధంగా అన్ని మండల కేంద్రాలలోని తహసిల్దార్ కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందన్నారు.