Take a fresh look at your lifestyle.

ఓట్ల లెక్కింపులో అత్యంత జాగ్రత్తలు పాటించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర, వనపర్తి :
మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని, లెక్కింపు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
శనివారం వనపర్తి జిల్లా ఐడిఓసి మీటింగ్ హాల్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కౌంటింగ్ సూపర్‌వైజర్లు మరియు అసిస్టెంట్లకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కౌంటింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని, లెక్కింపు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. చెల్లుబాటు అయ్యే ఓట్లను, చెల్లుబాటు కాని ఓట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఒకసారి రిటర్నింగ్ అధికారి ఏదైనా ఓటును ఇన్వాల్యూడ్ ఓటుగా పరిగణిస్తే , దానిని మళ్ళీ పరిగణనలోకి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు సరైన కారణాలతో లిఖితపూర్వక నోటీసు ఇచ్చినప్పుడు మాత్రమే రీ-కౌంటింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని, దీనిపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి తరపున ఒక వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ, కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో టిఓటి శ్రీనివాసులు, ఆర్వోలు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.