Take a fresh look at your lifestyle.

బిజెపి అభ్యర్థిని గెలిపించండి.

 

ముద్ర. పరకాల.

బిజెపి అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న వార్డు ప్రజలను కోరారు శనివారం 18వ వార్డు అభ్యర్థి పాసాని హేమలత సోమరాజు గెలుపు కోరుచు ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ప్రజా అనుకూల విధానాల వలన ప్రతి ఇంటికి మేలు జరుగుతుందన్నారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ అవినీతికి తావు లేదని ఆయన ఓటర్లకు వివరిస్తూ బిజెపికి ఓటేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. పరకాల పట్టణాన్ని గత ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు. 26 నెలలుగా రాష్ట్రంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పరకాలకు చేసిన మేలు ఏమీ లేదని రమన్న తీవ్రంగా విమర్శించారు. పరకాల పట్టణంలో నీ 22 వార్డులలో బిజెపి అభ్యర్థులు పోటీ పడుతున్నారని వారికి ప్రజలు అత్యధికంగా ఓటు వేసి గెలిపించాలని రామన్న ప్రజలను కోరారు. పరకాల మున్సిపాలిటీలో గతంలో నలుగురు వార్డు సభ్యులు గెలిచిన వార్డులలో అభివృద్ధి ప్రజల పక్షము నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.