Take a fresh look at your lifestyle.

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ దేపాక్ తివారి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యటించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.

అనంతరం చీఫ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విద్యార్థుల హాజరు, డ్యూటీ రిజిస్టర్, ప్రశ్నపత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మెడికల్ సిబ్బంది గురించి ఆరా తీశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? అని ఆరా తీశారు. తప్పనిసరిగా సి.సి కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల బండిల్ సీళ్లు తెరవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా పరీక్ష హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ ఫోన్లతో వచ్చారా అని కలెక్టర్ పరిశీలన చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్ కు ఆస్కారం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తతతో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పరీక్షలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.