Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ లీడర్ ఇంటి ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఒంటిపై పెట్రోల్ పోసుకొని అఘాయిత్యం
-డబ్బులు ఇచ్చేదాకా వెళ్లనని ఇంటి గేటు ఎదుట పడుకున్న వ్యక్తి
ముద్ర ,మోత్కూర్:
మోత్కూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్ ఇంటి ఎదుట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే మోత్కూరు మండలం ముశిపట్ల శివనగర్ కు చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2022లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు గౌడ్ కు రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. 2023లో రామచంద్ర రూ.10 లక్షలు ప్రభాకర్ రెడ్డికి తిరిగి ఇచ్చి మరో రూ. 5 లక్షలు 6 నెలలకు ఇస్తానని అప్పు కాగితం రాసుకున్నాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని,రేపు మాపంటూ తిప్పుకుంటున్నాడని బాధితుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తాను ఇతరులకు డబ్బులు ఇచ్చేది ఉందని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉందని, ఎంతగా బ్రతిమాలి అడిగినా పట్టించుకోవడం లేదని, తనకు గత్యంతరం లేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుండా పర్యవేక్షిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.