Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై దృష్టి పెట్టిన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మంత్రి పొన్నం , హర్షం వ్యక్తం చేసిన ఉద్యమకారులు

 

పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ రాక తొలి , మలిదశ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు అందరికీ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేయబోతున్నరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలాన్ని అందరికీ వర్తింపచేయాలని
కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి కాకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపి నష్టపోయిన ఉద్యమకారులను కూడా గుర్తించి అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన నీళ్లు , నిధులు , నియామకాలు మనకు వస్తాయని తమ జీవితాలను త్యాగం చేసి ఉద్యమంలో 13 ఏళ్లు అన్ని పక్కన పెట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం కోసమే పని చేశామని అన్ని రకాలుగా నష్టపోయి జీవితాలే భారంగా ఉద్యమకారులు అందరు బతుకుతున్నారని
వారి బ్రతుకులు చూసిన ఎసిసి అగ్ర నాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి ఆలోచించి వారికి భూమి , పెన్షన్ ఇస్తామని చెప్పడం హర్షణీయమని అన్నారు
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు , పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు , రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , టాప్ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గార్ల నాయకత్వంలో ఈ ప్రాంత ఉద్యమకారులు అందరికీ న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయబోతునటు ఉద్యమకారులకు తీపి కబురు చెప్పారు
ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ,సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఉద్యమకారులు అందరూ ఆశలు పెట్టుకున్నారని వెంటనే ప్రభుత్వం ఉద్యమకారుల గురించి ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దుబాటి చంద్రకళ , పొత్తు జ్యోతి రెడ్డి , లలిత ఠాకూర్ ,రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకర్ , మాడ నారాయణ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శి కందుల సదాశివ , స్టేట్ జర్నలిస్టు ఫోరం సురేష్ గౌడ్ , అధ్యక్షులు ఆర్.ఎం.పి పి.ఎం.పి పెద్దపెల్లి జిల్లా విభాగం అధ్యక్షులు ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి , కందుల అశోక్ పటేల్ , రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలిత ఠాగూర్ , జిల్లా ఉపాధ్యక్షులు జునుగురి సుధాకర్ , మంద మంద భాస్కర్ , కాల్వల తిరుపతి , జిల్లా కార్యదర్శి చంటి నరసక్క , జిల్లా కోశాధికారి ఆలేటి ఎల్లమ్మ , గట్ల రవీందర్ రెడ్డి , ఉద్యమకారుడు మొలుగూరినరసయ్య , రూపా ఠాగూర్ , గడ్డం లక్ష్మి , పెంచల మల్లయ్య , గుజ్జుల పద్మ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.