Take a fresh look at your lifestyle.

మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన శ్రీ చైతన్య యూత్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామానికి చెందిన గోపె నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం శ్రీ చైతన్య యూత్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుమారుడు గోపె నరసింహా కుటుంబానికి 50కేజీల బియ్యం ఆర్ధిక సహాయం అందజేసి కుటుంబానికి ధైర్యం చెప్పి తమ సహాయ సహకారం అన్ని విధాలుగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గోపె మహేష్, యూత్ అధ్యక్షులు గోపె కరుణాకర్, పెద్దలు గోపె స్వామి, గోపె బిక్షపతి, బసాని యాదగిరి, గోపె రవి, గోపె మల్లేష్, గోపె మహంకాళి, గోపె రమేష్, యూత్ సభ్యులు గోపె మధు, గోపె కుమార్, గోపె కుమారస్వామి, గోపె శ్రీధర్, గోపె నరసింహ, గోపె దుర్గాప్రసాద్, గోపె ప్రణతి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.