Take a fresh look at your lifestyle.

ప్రజాకళ పురస్కారం అందుకున్న వాకిటి రామ్ రెడ్డి

ముద్ర, వలిగొండ :
మండల పరిధిలోని పులిగిల్ల గ్రామనికి చెందిన చేయూత ఫౌండేషన్ చెర్మన్, ఆత్మీయ భారతీ సాహిత్య సేవ సంస్థ అధ్యక్షులు వాకిటి రామ్ రెడ్డి తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సాంస్కృతిక కళా రూపాల ప్రదర్శనలో భాగంగా బుదవారం సాయంత్రం రవీంద్ర భారతి పాల్కురికి సోమన్న మూల లో కవయిత్రి రమాదేవి కులకర్ణి అధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ‘కళ కలకాలం ఉండాలని’ తాను రచించిన పాట పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో యువజనాభ్యుదయ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహ్మ రెడ్డి
పాల్గొని వాకిటి రామ్ రెడ్డిని అభినందిస్తూ శాలువతో సన్మానిస్తూ, సర్టిఫికెట్, నగదు పురస్కారం అందచేశారు.
ఈ సందర్బంగా సంచాలకులు నరసింహ్మ రెడ్డి మాట్లడుతూ వాకిటి రామ్ రెడ్డి అద్బుతమైన పాటలు రచిస్తూ తన గాత్రంతో
సభికులను మంత్ర ముగ్దులను చేస్తారని, మునుముందు మరిన్ని రచనలు చేయలని కొనియాడారు. వాకిటి రామ్ రెడ్డి మాట్లడుతూ సాహిత్యంతో ఏనుగు నరసింహ్మ రెడ్డి రచించిన తెలంగాణ రుబాయిలు మట్టిపాట స్పూర్తి నింపాయని వారి కవిత్వం నాకు నిత్య నూతనం అని వారిచేతుల మీదుగా ప్రజాకళ పురస్కారం అందుకోవటం
గొప్ప అదృష్టం గా భావిస్తున్నానని కృతఙ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్, సిబ్బంది, హేమలతరెడ్డి , శాంతారెడ్డి , వనజ , సారథి కళాకారులు పల్లె శంకర్, సంద్య, ముప్పైమూడు మంది కవులు కళాకారులు సాహితీప్రియులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.