Take a fresh look at your lifestyle.

పర్వత్ నగర్ వాసులు భయపడొద్దు అండగా నేనుంటా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు


ముద్ర కూకట్‌పల్లి :
కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, పేద ప్రజల ఇళ్లకు తానే రక్షణగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక మాజీ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి ఆయన పర్వత్ నగర్‌లో పర్యటించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సర్వే నంబర్ 1007లో దశాబ్దాల కాలంగా ప్రభుత్వ అనుమతులతో నివాసం ఉంటున్న వారిని, కోర్టు ఉత్తర్వుల పేరుతో కొందరు వ్యక్తులు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. “పేద ప్రజల ఇళ్లను ఏదో ఒక కారణం చెప్పి లాక్కోవడం లేదా కూల్చివేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది” అని ఆయన విమర్శించారు.
​స్థానిక ప్రజలు తమ ఆవేదనను ఎమ్మెల్యేకు విన్నవిస్తూ.. తమ వద్ద ఇంటి నంబర్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు, విద్యుత్ మరియు మంచినీటి కనెక్షన్లు వంటి అన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ కొంతమంది కుట్రపూరితంగా తమను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
​​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పర్వత్ నగర్ నివాసితులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.