Take a fresh look at your lifestyle.

​జేఎన్‌టీయూలో ఘనంగా హోలీ వేడుకలు

​ముద్ర కూకట్‌పల్లి :
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) క్యాంటీన్ వద్ద స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు పూసుకుంటూ, ఆటపాటలతో సందడి చేశారు.
​ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు రాహుల్ నాయక్, దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే హోలీ పండుగను వర్సిటీలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తమ జీవితాల్లో ఎదురయ్యే చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన జేఎన్‌టీయూ ఉన్నతాధికారులకు మరియు కేపీహెచ్‌బీ పోలీసులకు స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
​ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సాగర్ నాయక్, శ్రీను, జై రామ్, ఆనంద్, ధనుంజయ్, శ్రీకాంత్, మోహన్, సోహన్, రామకృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.