ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ గావించారు. బుధవారం సందర్భంగా శ్రీ స్వామి వారి దివ్య పాదారవిందములకు ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన, నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు.

తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.