Take a fresh look at your lifestyle.

ప్రజావాణి శేరిలింగంపల్లి జోన్ లో 19 ఫిర్యాదులు

ముద్ర, శేరిలింగంపల్లి :
శేర్లింగంపల్లి జోన్వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయం తోపాటు నార్సింగ్, అమీన్పూర్, పటాన్చెరువు, మియాపూర్ శేరిలింగంపల్లి సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కాగా మొత్తం 19 వినతులు అధికారులకు అందాయి. ఇందులో జోనల్ కార్యాలయంలో 4, శేర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 9, నార్సింగ్ సర్కిల్ కార్యాలయంలో 1, మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో 3 మరియు అమీన్పూర్ సర్కిల్ 2 చొప్పున వినతులు వచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతిపత్రం రూపంలో అందించారు. జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు.

Leave A Reply

Your email address will not be published.