శాఖ గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని అన్ని శాఖ గ్రంథాలయాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవైస్ ఉర్ రెహ్మాన్ చిస్తీ చెప్పారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ యాదాద్రి జరిగిన రివ్యూ మీటింగ్ లో ఆయన గ్రంథ పాలకులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాఖా గ్రంధాలయంలో ఉన్న బిల్డింగ్ రిపేర్లను, కరెంటు, బాత్రూంలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఉద్యోగులను సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం .సుధీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రంథ పాలకుడు గ్రంథాలయ సెస్ కట్టించాలని గ్రంథ పాలకులను కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, కార్యదర్శి గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.