Take a fresh look at your lifestyle.

మహాత్ముల ఆశయాలను కొనసాగించాలి

  • మహాత్మాజ్యోతిరావుపూలే Dr. Br అంబేద్కర్ విగ్రహల ఆవిష్కరించిన మాజీ మంత్రి Dr. లక్ష్మారెడ్డి.

ముద్ర ప్రతినిధి జడ్చర్ల: మహాత్మా ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే యువత సన్మార్గంలో పయనిస్తుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.శుక్రవారం జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో మహాత్ములు మహాత్మజ్యోతిరావుపూలే, Dr. Br అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ ఏర్పాటు సందర్భంగా ఆయన పాల్గొని మహాత్ముల విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి మార్గం చూపి సమ సమాజ స్థాపనకు ఎంతో కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అంబేద్కర్ లు అని ఆయన కొనియాడారు.అలాంటి వారి ఆశయాలను కొనసాగిస్తూ సమాజానికి మేలు కలిగి పనులు చేస్తూ యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, పసునూరి రవీందర్. రజనిసాయిచంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.