Take a fresh look at your lifestyle.

జిల్లాలో పదో తరగతి ఫలితాలపై అబినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా 2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపి తెలంగాణ రాష్ట్రంలో 4 వ స్థానం సాధించిన నందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.అలాగే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరాశ పడకూడదని, ఇది ఓ దశ మాత్రమేనని, ప్రయత్నాలు కొనసాగిస్తే విజయం తప్పదని అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులను త్వరలో నిర్వహించే పరీక్షకు సన్నద్ధం చేయాలని అందుకు సరైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఈ ఓ కె. రాము కో ఆర్డినేటర్లు సిహెచ్ సత్యనారాయణ, కే. రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.