Take a fresh look at your lifestyle.

అర్ధరాత్రి ఒంటరి మహిళగా రోడ్డుపై ఎంట్రీ ఇచ్చిన లేడీ పోలీస్ సింగం …

 

  • చుట్టు ముట్టిన పోకిరీలు…
  • మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి సంచలన ఆపరేషన్…

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి :

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఐదవ రోజే సంచలన ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి పోలీస్ డ్రెస్ లేకుండా సాదారణ మహిళగా ఒంటరిగా ఆమె దిల్ సుఖ్ నగర్ బస్ స్టాండ్ కు వెళ్ళి అక్కడి ఆకతాయిల ఆట కట్టించారు.


రాత్రి పూట బస్టాండ్ లో బస్ ల కోసం నిల్చున్న సగటు మహిళలను పోకిరీలు ఎలా వేదిస్తారో ఈ సందర్బంగా ఆమె ఆమె స్వయంగా గమనించారు.కమిషనర్ అని తెలియక 40 మంది పోకిరీలు పోలీస్ కమిషనర్ మాలతి ని చుట్టుముట్టి వెకిలి చేష్టలతో వేదించారు.వారి చేష్టలను ఆమె చాలా సేపు ఓపిక తో భరిస్తూనే వారిని పూర్తిగా గమనించింది.
అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సుమతి ఆపరేషన్ నిర్వహించారు.
కమిషనర్ సుమతి ని చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే. అందులోనూ మద్యం మత్తు, గంజాయి మత్తులో ఉన్న యువకులు ఉన్నారు. 3 గంటల పాటు అటు వైపు పెట్రోలింగ్ పోలీసులు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.
రకరకాల అసభ్య ప్రశ్నలతో పోకిరీలు ఆమెను చుట్టు ముట్టారు. అయినా మొక్కవోని ధైర్యంతో అలానే ఉండి అందరిని గమనించసాగింది. చివరికి తెల్లవారు జామున 3:30 కు అటు వైపు వచ్చిన బీట్ కానిస్టేబుల్ కమిషనర్ మాలతి ని గమనించి ఆమె దగ్గరికి వెళ్ళాడు.
మూడు రోజుల పాటు దిల్సుక్ నగర్ బస్టాండ్ వైపు ఆమె స్వయంగా నిఘా పెట్టి ఈ ఆపరేషన్ నిర్వహించడం విశేషం. ఈ సందర్బంగా 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి
అందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు.
చదువుకోవాల్సిన యువకులు రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతూ పోకిరి చేష్టలు మహిళలను వేదిస్తున్నారు.
ఎక్కువగా హాస్టల్స్ ఉండటం వల్ల ఈ తరహా పోకిరీలు ఎక్కువ అయినట్టు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.