Take a fresh look at your lifestyle.

మండలంలో చిరుత పులి సంచారం వాస్తవమే.-అటవీ శాఖ సెక్షన్ అధికారి 

 

జాగ్రత్తగా ఉండాలని గ్రామస్తులకు సూచన….

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి
ఫిబ్రవరి 10:మెదక్ జిల్లా
అల్లాదుర్గం మండలంలో చిరుత పులి సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ అన్నారు.మంగళవారం అటవీ శాఖ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించి,ఆన వాళ్ళను గుర్తించారు. అనంతరం సమీప తాండా ప్రజలకు పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గొల్ల కుంట తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఆ చిరుత వెళ్లినట్లు వారు గ్రహించారు. కనుక గొర్ల కాపరులు ,వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, గ్రామస్తులు ,అటువైపు వెళ్ళకూడదని ఆయన సూచించారు. మండలంలో చిరుత పులి సంచరిస్తున్న విషయం వాస్తవమేనని సమీప గ్రామ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. మరోసారి చిరుత కనిపిస్తే సమాచారం అందించాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ మనస్విని,సర్పంచ్ మాన్యా నాయక్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.