Take a fresh look at your lifestyle.

వార్డు కార్యాలయం ప్రారంభించిన జువ్వాడి

 

కోరుట్ల, ముద్ర
వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని బుధవారం రోజు కోరుట్ల పట్టణంలో మున్సిపల్ విలీన గ్రామమైన ఎఖీన్ పూర్ 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు తోపాటు కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ అహ్మద్, పాల్గొనగా వారందరికీ స్థానిక వార్డు కౌన్సిలర్ మేడిపల్లి శిరీష శేఖర్ రెడ్డి శాలువాలతో సన్మానించి మిఠాయిలు తినిపించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కౌన్సిలర్లు రెంజర్ల కళ్యాణి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.