Take a fresh look at your lifestyle.

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

గొల్లపల్లి, ముద్ర : సిద్ధాంతిక నిబద్ధత తో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని ధర్మపురి నియోజకవర్గ మాజీ  కన్వీనర్ కస్తూరి సత్యం పేర్కొన్నారు.జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కొక్కు లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ జెండా ఆవిష్కరించి టపాకాయలు పేల్చి సీట్లు పంపిణీ చేశారు.భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కస్తూరి సత్యం మాట్లాడుతూ. గత 45 సంవత్సరాల క్రితం 1980 ఏప్రిల్ 6 వ దేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అంత్యోదయ సిద్ధాంత ప్రాతి పదికన ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ  అవినీతి రహిత పారదర్శకత పాలనతో దేశాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.నాడు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ సుపరి పాలనకు బాటలు వేస్తే నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర గామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.రాబోవు రోజుల్లో యువత మహిళల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు భీమ మహేష్ పార్టీ కార్యదర్శిలు సాయిని రాజు, సంకటి గంగారాజం, శక్తి కేంద్రం ఇన్ ఛార్జి రాఘవరెడ్డి, ఎలేటి లింగారెడ్డి, సాంబారి శ్రీనివాస్, దూస ప్రశాంత్, పార్టీ సీనియర్ నాయకులు పాదం మహేష్ పటేల్, గడ్డి పోశయ్య, ఉష్కమల్ల సత్యం, మోరపల్లి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.