Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించండి

  • అధికారులకు డీఆర్వో సంగీత ఆదేశం.

ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కొంగకలాన్ జిల్లా కలెక్టరేట్ సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా రెవెన్యూ అధికారి సంగీత స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (56) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.కాగా, ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 21, ఇతర శాఖలకు చెందినవి 35, మొత్తం 56 దరఖస్తులు అందాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.